జోరుగా తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా ప్రచారం - PRATHPADU
ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా ప్రచారం జోరుగా కొనసాగిస్తోంది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.
వరుపుల రాజా ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోతెదేపా ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు.