ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

''సబ్ కమిటీలు.. నాటి వ్యవహారాలపైనా విచారణ చేయాలి'' - తెదేపా నేత

విద్యుత్తు కొనగోళ్లలో వైఎస్ హయాంలోనే అవినీతి జరిగిందని తెదేపా నేత ఆళ్లపాటి రాజా ఆరోపించారు. వైకాపా నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోడానికే సబ్ కమిటీ ఏర్పాటని విమర్శించారు.

సబ్ కమిటీలు వైఎస్ హయాంలోని బినామీ కంపెనీలను విచారించాలి :  ఆళ్లపాటి

By

Published : Jun 27, 2019, 8:25 PM IST

అవినీతి కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు... సమీక్షలు అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత ఆళ్లపాటి రాజా ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో బినామీ కంపెనీల నుంచి అధిక రేటుకు విద్యుత్తు కొనుగోళ్లు చేశారని రాజా ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు... ఆ బినామీ కంపెనీలపై విచారణ జరిపితే అభిప్రాయపడ్డారు. జగన్ తండ్రి హయాంలోనే అదనపు విద్యుత్తు ఛార్జీలు మోపారని ఆళ్లపాటి రాజా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details