రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్.. హింసాత్మకంగా మారింది. అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత సిద్ధా బాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తాడిపత్రిలో జరిగిన ఈ ఘటన.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసింది. తన పెదనాన్న.. వైకాపా నేతల దాడిలో చనిపోయినట్టు భాస్కర్ రెడ్డి అన్న కొడుకు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాడిపత్రి రణరంగం.. తెదేపా నేత మృతి - godava
అనంతపురం జిల్లాలో పోలింగ్ సందర్భంగా భయానక ఘటనలు నెలకొన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో వైకాపా బీభత్సం సృష్టిస్తోంది. మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
godava
రాప్తాడు నియోజకవర్గంలోనూ వైకాపా నేతలు దౌర్జన్యం సృష్టిస్తున్నారు. సిద్ధరాంపురం గ్రామంలో పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణ చోటుచేసుకుంటుంది. తెదేపా, వైకాపా వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. సనప గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో ఆరుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలపాలయ్యారు.
Last Updated : Apr 11, 2019, 2:02 PM IST