ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సిక్కోలులో జోరుగా తెదేపా ప్రచారం - ap latest

ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్​ బెల్లుపడలో ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాజాం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కొండ్రుమురళి రేగిడి మండలంలో ప్రచారం నిర్వహించారు

జోరుగా తెదేపా ప్రచారం

By

Published : Mar 27, 2019, 8:26 PM IST

జోరుగా తెదేపా ప్రచారం.
శ్రీకాకుళం జిల్లాలో తెదేపా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్​ బెల్లుపడలో సతీసమేతంగా ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.గ్రామంలోని 12, 13,14 వార్డుల్లో విస్తృతస్థాయిలో పర్యటించి... సమస్యలపై ఆరా తీశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ..గెలిపించాలని విన్నవించారు.


రేగిడి మండలంలో కొండ్రు మురళి ప్రచారం
రాజాం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి రేగిడి మండలంలో ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పనసవలస వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బాల వలస, మునగల వలస, అంబాడ, పారంపేట, ఉనుకూరు, కాగిత పల్లి, కొర్లవలస గ్రామాల్లో పర్యటించారు.


ABOUT THE AUTHOR

...view details