ఎవరిది నేర చరిత్రో పులివెందులలో అందరికీ తెలుసు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రజలు అనుకుంటున్నారు. మా వైపు నుంచి ఏ చిన్న తప్పున్నా.. నడిరోడ్డుపై కాల్చండి.
- సతీశ్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థి
వివేకా మృతి.. 'తప్పు చేస్తే కాల్చేయండి!' - AP LATEST
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా తప్పుంటే నడిరోడ్డుపై కాల్చండి : సతీశ్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా వైకాపా నేతల వ్యాఖ్యలున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తున్నారు.
- బోండా ఉమ, ఎమ్మెల్యే
గత ఎన్నికల్లో వైయస్ మరణాన్ని జగన్ వాడుకున్నారు. ఈ ఎన్నికల్లో వివేకా మృతిని వాడుకుంటారు. సానూభూతి రాజకీయాలకు తెరలేపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు మరెన్ని జరుగుతాయో!
- లింగారెడ్డి, తెదేపా నేత