గుడ్లురిమిన భానుడు... త్రిపురాంతకంలో 47 ప్లస్... - భానుడి
భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రంపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. 45 డిగ్రీలు దాటిన ఎండలో బయట.. ఉక్కపోతతో లోపల జనం అల్లాడిపోతున్నారు.
రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతల వివరాలు
త్రిపురాంతకం -47
విజయవాడ -46
తిరుపతి -45
ఒంగోలు -44
రాజమహేంద్రవరం-44
గుంటూరు -43
విజయనగరం -43
ఏలూరు- 43
నెల్లూరు- 43
కాకినాడ- 42
కడప- 42
విశాఖ- 41
శ్రీకాకుళం- 40
కర్నూలు- 40
అనంతపురం- 39