సింహాద్రి అప్పన్న సన్నిధిలో విశ్వక్సేనయేష్ఠి - AP LATEST
సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో మంగళవారం సుదర్శన నారసింహ యాగం వైభవోపేతంగా జరిగింది.
విశ్వక్సేనయేష్ఠి
విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాద్రీ అప్పన్న సన్నిధిలో మంగళవారం సుదర్శన నారసింహయాగం ఘనంగా జరిగింది. ఈ పూజల్లో పాల్గొని స్వామిని ప్రార్థిస్తే విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందులో భాగంగా జరిగిన విశ్వక్సేనయేష్ఠికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘన బాబు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారయణల కుటుంబాలు యాగంలో పాల్గొన్నాయి. నేడు జరగబోయే మహాపూర్ణహుతికి సర్వ సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.