ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

శాసనసభ ముందుకు నేడు ఆరు బిల్లులు

రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో 6 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు పలు అంశాలపై కీలక చర్చ జరగనుంది.

By

Published : Feb 6, 2019, 9:03 AM IST

సభ

రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో 6 బిల్లులను ప్రవేశపెట్టనుంది. విలువ ఆధారిత పన్నుల సవరణ , ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు సవరణ ,వెనుకబడిన తరగతుల ఉపప్రణాళిక ,విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు , కాపులు మినహా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 5 శాతం రిజర్వేషన్లు , విద్య -ఉద్యోగ అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లతో పాటు కేంద్రం ఈబీసీలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు , ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు , చుక్కల భూముల సమస్య , శాసనసభ్యులకు నిధుల కేటాయింపు , నాణ్యమైన విత్తనాల సరఫరా ,వెబ్‌ల్యాండ్‌లో భూములకు భూదార్ నంబర్ల వంటి అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరగనుంది. గవర్నర్ ధన్యవాదాల తీర్మాణంపై సభలో చర్చ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details