ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఉపాధ్యాయ నివేదికపై 3నెలల్లోపు స్పందించండి: సుప్రీం - minority

దేశంలో మైనారిటీలుగా పరిగణించేందుకు ప్రస్తుతమున్న మార్గదర్శకాలను పున:సమీక్షించి 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్​(ఎన్​సీఎం)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఉపాధ్యాయ్​ నివేదికపై 3నెలల్లోపు స్పందించండి:సుప్రీం

By

Published : Feb 11, 2019, 7:33 PM IST

దేశంలోని వివిధ వర్గాలను అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణించేందుకు ప్రస్తుత్తం ఉన్న మార్గదర్శకాలను పున:సమీక్షించాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్​ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ విషయంపై నివేదికను రూపొందించారు. ఉపాధ్యాయ్​ నివేదిక పై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్​సీఎంను ఆదేశించింది.

మైనారిటీలను దేశ జనాభా ఆధారంగా కాక రాష్ట్రాల వారీ జనాభాను పరిగణలోకి తీసుకుని నిర్వచించాలని ఉపాధ్యాయ్​ తన నివేదికలో పొందుపరిచారు.

జాతీయ జనాభా గణాంకాల ప్రకారం హిందువులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతర వర్గాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ కారణంగా హిందువులు కొన్ని రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక వర్గాల వారికి లభించే ప్రయోజనాలను పొందలేక పోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఉపాధ్యాయ్​.

ABOUT THE AUTHOR

...view details