ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎస్​బీఐ ఉద్యోగి చేతివాటం.. రైతులకు కోటి టోకరా

కంచికచెర్ల మండం పరిటాల ఎస్​బీఐ క్యాషియర్ చేతివాటం ప్రదర్శించాడు. పొలం పనుల కోసం రుణం తీసుకున్న రైతులను మోసం చేసి... కోటి రూపాయలతో ఉడాయించాడు. సుమారు 90కి పైగా నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

రైతులకు రూ.కోటి టోకరా వేసిన ఎస్​బీఐ క్యాషియర్

By

Published : May 27, 2019, 6:01 PM IST

రైతులకు రూ.కోటి టోకరా వేసిన ఎస్​బీఐ క్యాషియర్

కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల ఎస్​బీఐలో క్యాషియర్ పని చేస్తోన్న శ్రీనివాసరావు చేతివాటం ప్రదర్శించాడు. పొలం పనుల కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న రైతులను మోసం చేశాడు. రైతులు తీసుకున్న రుణాన్ని రెట్టింపు చేసి... ఆ నగదును స్వాహా చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. సుమారు 90 నకిలీ ఖాతాలు సృష్టించి రూ. కోటికి పైగా మోసం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత రెండు రోజులుగా బంగారం విడిపించుకునేందుకు బ్యాంకుకు వస్తున్నా...సర్వర్లు పని చేయడం లేదని ఉద్యోగులు కప్పి పుచ్చుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.

ఇవీ చూడండి : జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details