ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏ క్షణంలోనైనా సమ్మె జరగొచ్చు..సిద్ధంగా ఉండండి - rtc

ఈనెల 22 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేసే అవకాశం ఉందని ఆర్టీసీ ఐకాస తెలిపింది. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు కడపలో ధర్నా చేపట్టారు. కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని, బడ్జెట్​లో నిధులు కేటాయించాలని డిమాండ్​ చేసింది.

'ఏ క్షణంలోనైనా సమ్మె జరగొచ్చు..సిద్ధంగా ఉండండి'

By

Published : May 17, 2019, 8:06 PM IST

ఆర్టీసీ కార్మికుల ధర్నా
ఆర్టీసీ యజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా 9 సంఘాల ఐకాస రాష్ట్ర వ్యాప్త సమ్మెకు ఇటీవల పిలుపునిచ్చింది. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా నిరసన జ్వాల ఎగసిపడొచ్చని కడప ఐకాస తెలిపింది. కార్మికుల డిమాండ్​లను పరిష్కరించాలని నేడు కడపలో ధర్నా చేపట్టింది. అవుట్​ సోర్సింగ్​ విధానాన్ని రద్దు చేయాలని నేతలు కోరారు. వేతన బకాయిలు చెల్లించి..అద్దె బస్సుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కారుణ్య నియమాకాలు తక్షణమే చేపట్టాలన్నారు.

For All Latest Updates

TAGGED:

rtcjac

ABOUT THE AUTHOR

...view details