ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దీపక్ హర్షది హత్యే... బంధువుల ఆందోళన! - person death

పశ్చిమ గోదావరి జిల్లా ఆలివేరు జల్లేరు జలాశయంలో పడి ఆదివారం మృతి చెందిన దీపక్ హర్ష అనే వ్యక్తిది హత్యేనని అతని బంధువులు ఆరోపించారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ జంగారెడ్డిగూడెంలో ఆందోళన చేశారు.

దీపక్ హర్షది హత్యే...బంధువులు ఆందోళన

By

Published : Jul 2, 2019, 7:02 PM IST

దీపక్ హర్షది హత్యే...బంధువులు ఆందోళన


పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఆలివేరు జల్లేరు జలాశయంలో పడి దీపక్ హర్ష అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీపక్​హర్షను హత్య చేశారంటూ ఆయన బంధువులు జంగారెడ్డిగూడెం కూడలిలో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పార్టీ పేరుతో జలాశయం వద్దకు తీసుకెళ్లి స్నేహితులే హతమార్చారని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు దిగారు. పోలీసు​లు వారించినా ఆందోళన కొనసాగించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details