ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వైకాపా స్టార్‌ క్యాంపెయినర్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు: వైవీబీ - YVB

తెలుగుజాతిపై పగబట్టి ఆంధ్రాను నాశనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రధాని మోదీ ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలనే మోదీ రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు.

PRASAD

By

Published : Apr 1, 2019, 1:48 PM IST

వైవీబీ రాజేంద్రప్రసాద్
గుజరాత్‌ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ.. ఏపీకి వచ్చి విమర్శలు చేసి వెళ్తున్నారని తెదేపా ఎమ్మెల్సీవైవీబీ రాజేంద్రప్రసాద్‌ అమరావతిలో ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అవినీతిపరుడైన జగన్‌పై మోదీ ఒక్క మాటైనామాట్లాడారాఅని ప్రశ్నించిన వైవీబీ...జగన్‌, మోదీలిద్దరూ పరస్పరంవిమర్శలు చేసుకోరని వ్యాఖ్యానించారు.

వైకాపాకు స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రధాని మోదీ,.. భాజపాకు స్టార్‌ క్యాంపెయినర్‌గా జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. లోకేశ్‌ను విమర్శించడం ప్రధాని మోదీ స్థాయికి తగదనిరాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. చంద్రబాబు కష్టపడి కియా మోటార్స్‌ తీసుకొచ్చారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details