పార్టీలో పదవులు అనుభవించి..తర్వాత పార్టీలు మారడం రాజ్యసభ ఎంపీలకు రివాజుగా మారిందని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. 1985 నుంచి ఇప్పటివరకూ 25మంది రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం నుంచి పార్టీ మారారని ఆయన అన్నారు. ఎవరు పార్టీ మారినా కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కాకినాడలో సమావేశం నిర్వహించిన కాపు సామాజిక వర్గ నేతలతో తాను మాట్లాడానన్న చినరాజప్ప..ఎవరూ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
ఎవరు పార్టీ మారిన...తెదేపాకు నష్టం లేదు : చినరాజప్ప - ఎంపీలు
1985 నుంచి ఇప్పటి వరకూ 25 మంది రాజ్యసభ ఎంపీలు తెదేపాను వీడివెళ్లారని తెదేపా ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాజ్యసభకు పంపిస్తే పార్టీ మారడం రీవాజుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరు పార్టీ మారిన...తెదేపాకు నష్టం లేదు : చినరాజప్ప