భద్రాద్రి ఆలయంలో కల్యాణపనులు వేగంగా జరుగుతున్నాయి. వేడుకలో కీలకమైన గరుడపటాన్ని ఇవాళ ఎగురవేశారు. ముందుగా బేడా మండపంలో అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములను ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి గరుడ పటాన్ని ఎగురవేశారు. తర్వాత గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
రామయ్య కల్యాణానికి సర్వం సిద్ధం.. సర్వదేవతలకు ఆహ్వానం - rama
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా.. ఆలయ అర్చకులు వేదపండితులు స్వామివారికి రోజుకో విధంగా సేవలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.
రేపు మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. ఈనెల 15న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయం వద్ద గల వైకుంఠద్వారం ఎదుట సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణ ఉత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్లు, భక్తులకు అందించే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను సిద్ధం చేశారు. ఎండాకాలం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇదీ చూడండి:ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య