ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కత్తులతో దాడులు...15 మందికి తీవ్రగాయాలు! - cm

పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తికోళ్ల లంక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పాత కక్షలే గొడవకు కారణమని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ పరామర్శించారు.

15 మందికి తీవ్రగాయాలు

By

Published : Apr 12, 2019, 5:24 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. ఓటింగ్​ ముగిసిన అనంతరం రేగిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. తెదేపా, వైకాపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ పరామర్శించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెదేపా , వైకాపై కార్యకర్తల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details