ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

''ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి'' - ప్రపంచ దేశాలు

సీఆర్​పీఎఫ్​ జవాన్లపై భారత్​లో జరిగిన ఉగ్రదాడి పట్ల పలు దేశాలు సానుభూతి ప్రకటించాయి.

''ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి''

By

Published : Feb 15, 2019, 7:00 AM IST

''ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి''
జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రవాదమూకలు జరిపిన దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

సీఆర్​పీఎఫ్​ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది రష్యా రాయబార కార్యాలయం. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉగ్రవాదంపై వ్యతిరేకంగా ప్రపంచదేశాలన్నీ పోరాడాలని పిలుపునిచ్చింది.

జవాన్లపై ఉగ్రదాడి పిరికిపంద చర్యగా పేర్కొంది అమెరికా.

''అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు నా​ ప్రగాఢ సానుభూతి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్​కు మద్దతుగా నిలుస్తాం''
-రాయబారి,కెన్నెత్​ జస్టర్

  • నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకించిన జర్మనీ, ఫ్రాన్స్​లు అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి.
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తామెప్పుడూ భారత్​వైపే ఉంటామని స్పష్టం చేసింది ఫ్రాన్స్​.
  • తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశమైన భారత్​కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది జర్మనీ.
  • ఇతర దేశాలు ఆస్ట్రేలియా, టర్కీ, కెనడా, చెక్​ రిపబ్లిక్​లు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.
  • భారత పొరుగు దేశాలైన బంగ్లాదేశ్​, భూటాన్​, శ్రీలంక, మాల్దీవులు అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఉమ్మడిగా పోరాటం చేయాల్సినవసరముందని పిలుపునిచ్చాయి.
  • శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా, మాల్దీవ్స్​ అధ్యక్షుడు ఇబ్రహీంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details