రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న పునేఠాను ఏపీఎండీసీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు ఇచ్చారు.
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పునేఠ - lv subrahmanyam
ఎన్నికలకు ముందు సీఎస్‌గా తొలగించిన అనిల్ చంద్ర పునేఠకు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ సీఎస్ పునేఠ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ
మార్చి 29 తేదీన పునేఠాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు బదిలీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అప్పటి నుంచి ఆయన వెయింటింగ్లోనే ఉన్నారు. ఈ నెల 31 తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండటం వలన పునేఠాకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Last Updated : May 20, 2019, 9:46 AM IST