రాష్ట్రంలో తెదేపా నేతలపై జరిగే దాడులు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ, జగన్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డి... ఈసీని పొగిడేందుకు పోటీ పడుతున్నారని డొక్కా అన్నారు. ఈవీఎంలు పని చేయకుండా మొరాయిస్తే.. ప్రజలు పడ్డ ఇబ్బందులు వైకాపాకు కన్పించలేదా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష వైకాపా చేసే ఫిర్యాదులకు మాత్రమే ఎన్నికల సంఘం స్పందిస్తుంది తప్పా తెదేపా ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ పక్షపాత ధోరణికి ఇదే నిదర్శనమన్నారు. తెదేపా ఈవీఎం నిపుణులు హరిప్రసాద్‌పై ఉన్న కేసుకు అభ్యతరం చెప్పిన ఈసీకి... వైకాపా చేస్తున్న దాడులు కన్పించడం లేదా అన్నారు.