ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"కరెంట్ లేదు... తాగునీరు రాదు.. ఇంకెంతకాలమీ వ్యథ" - west godavari

"కరెంట్ లేదు... తాగునీరు రాదు... ఏళ్ల తరబడి ఇలానే బతుకుతున్నాం. ఇకెంతకాలం ఇలా కాలం వెళ్లదీయాలి. ఇకనైనా మా వ్యథను ఆలకించండి.." సీతంపేట వాసులు వేడుకుంటున్నారు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు.

మంచినీరు కరెంటు లేక సీతంపేట గ్రామం విలవిల

By

Published : Jul 1, 2019, 11:41 PM IST

మంచినీరు కరెంటు లేక సీతంపేట గ్రామం విలవిల

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సీతంపేట గ్రామంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన కాలనీలో గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని... అక్కడ తాగునీరు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడితే ప్రాంతమంతా అంధకారమై బిక్కుబిక్కుమంటూ రావాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. తమ పిల్లలు బయటకి వస్తే పాములు, పురుగులు కుట్టి ఆసుపత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ప్రజా ప్రతినిధులు హామీలిస్తున్నారే తప్ప... సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తమ గోడు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఏలూరు కలెక్టరేట్​ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details