గుంటూరు జిల్లా లింగంగుంట్లలో 17 ఎకరాల గ్రామ పంచాయతీ భూమిని తమ ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని.. సుమారు 200 మంది గ్రామస్థులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీకి చెందిన ఆ స్థలంలో బైఠాయించి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. నివాసాల కోసం ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్న..పట్టించుకోలేదని డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శేషన్నలకు విన్నవించారు. ఆందోళనకారులతో మాట్లాడిన అధికారులు.. సమస్యపై ఈ నెల 26న చర్చిస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల హామీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇళ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన - narasarao peta
గుంటూరు జిల్లా నరసారావుపేట మండలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లింగంగుంట్లలో 17 ఎకరాల గ్రామ పంచాయతీ స్థలాన్ని తమ గృహాల నిమిత్తం కేటాయించాలని.. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఆందోళన చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ , మున్సిపల్ కమిషనర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళన