బీర్లకు పోలీసుల కాపలా..! - ap latest
హైదరాబాద్ బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా పడింది. రహదారిపై 17వందలకు పైగా ఉన్న బీర్ కాటన్లు చోరీ కాకుండా పోలీసులు కాపలా కాశారు.
హైదరాబాద్ బేగంపేటలో బీరుసీసాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వాహనం బేగంపేట్ వద్ద నడిరోడ్డుపై బోల్తా పడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పిల్లర్ 30 వద్ద అదుపుతప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. స్వల్ప గాయాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. 17వందలకు పైగా పడివున్న బీర్ కాటన్లు చోరీ కాకుండా పోలీసులు పహారా కాశారు. అనంతరం బీర్లను వేరే వాహనంలో రవాణా చేశారు.