ETV Bharat / briefs
తెలంగాణలో.. 'మిషన్ భగీరథ ఫౌంటేన్'!! - PI[PE LEAKEGE
అసలే ఎండాకాలం. తాగేందుకే నీరు దొరకని ఈ సమయంలో.. కొందరి నిర్లక్ష్యం ఇంతటి నష్టానికి కారణమైంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోట చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన కారణంగా.. వేల లీటర్ల నీరు ఇలా వృథా అయ్యింది.
mission bhagiratha pipeline damaged
By
Published : Mar 30, 2019, 4:49 PM IST
| Updated : Mar 30, 2019, 5:31 PM IST
ఫౌంటైన్ కాదు.. ఇది పగిలిన పైప్ లైన్ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలో.. మిషన్ భగీరథ పైపులైను ధ్వంసమైంది. చిన్న చింతకుంట మండలం లాల్కోట చౌరస్తాలో గేటు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా పైపు పగిలి పెద్ద ఎత్తున నీరు చిమ్మింది. జాతీయ రహదారిపై ఫౌంటైన్లా వందల అడుగుల ఎత్తుకు నీరు చిమ్మింది. చాలా సేపు మంచినీరు వృథాగా పోయి... చుట్టపక్కన పంటపొలాలు, రోడ్లు చెరువుల్లా మారాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు నీటి వృథాను అరికట్టారు.పైప్ లైన్ లీకేజీకి కారణం నిర్వాహకుల పర్యవేక్షణ లోపమేనని గ్రామస్థులు ఆరోపించారు. Last Updated : Mar 30, 2019, 5:31 PM IST