ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మండలికి పయ్యావుల, సలహాదారుగా కోడె.. రాజీనామాలు - పయ్యావుల కేశవ్

సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన పయ్యావుల కేశవ్... తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను ఆమోదిస్తూ మండలి కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు.

మండలి సభ్యత్వానికి పయ్యావుల కేశవ్ రాజీనామా

By

Published : Jun 4, 2019, 11:03 PM IST

మండలి సభ్యత్వానికి పయ్యావుల కేశవ్ రాజీనామా

శాసన మండలి సభ్యత్వానికి తెదేపా నేత పయ్యావుల కేశవ్ రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యునిగా ఎన్నిక అయినందున ఆయన మండలికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను ఆమోదిస్తూ శాసన మండలి కార్యదర్శి సత్యనారాయణరావు అధికారికంగా నోటిఫికేషన్​ జారీ చేశారు. మరోవైపు..హోంశాఖ సలహాదారు పదవికి మాజీ ఐపీఎస్ అధికారి కోడె దుర్గాప్రసాద్ రాజీనామా చేశారు. హోంశాఖ సలహాదారుగా ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాలతో పాటు, వివిధ అంశాలను పర్యవేక్షించేవారు. దుర్గాప్రసాద్ రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

ABOUT THE AUTHOR

...view details