ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

50% లెక్కించాల్సిందే: భాజపాయేతర పక్షాలు - చంద్రబాబు

దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరైయ్యారు.

దిల్లీలో ప్రతిపక్ష నేతల భేటీ

By

Published : Apr 14, 2019, 12:57 PM IST

Updated : Apr 14, 2019, 1:44 PM IST

ఈవీఎంలో లోపాలు, పోలింగ్‌లో తలెత్తుతున్న సమస్యలు, వీవీప్యాట్‌ల లెక్కింపు ప్రధానాంశంగా భాజపాయేతర పక్షాలు సమావేశమయ్యాయి. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరుగుతున్న సమావేశానికి సీఎంచంద్రబాబు, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ నేతలు కపిల్ సిబల్, అభిషేక్మనుసింఘ్వీ హజరయ్యారు. ప్రజాస్వామ్యాన్నికాపాడుకోవడం, పారదర్శకంగాఎన్నికలు నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎన్నికలసంఘం ఏకపక్ష నిర్ణయాలుతీసుకుంటుందనే ఆరోపణలపైనా సమాలోచనలు జరుపుతున్నారు. ఈవీఎంలలోలోపాలపై సాంకేతిక నిపుణులతోనూ మాట్లాడుతున్నారు. వీవీఫ్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేసే అంశంపైనా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. పారదర్శక ఎన్నికల కోసం వీవీ ప్యాట్‌లు లెక్కించాల్సిందేనని నాయకులంతా డిమాండ్ చేశారు.

Last Updated : Apr 14, 2019, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details