ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ - విశాఖ

విశాఖ నుంచి దిల్లీకి ప్రయాణించే ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యల పుట్టగా మారింది. బోగీల్లో ఏసీల పనిచేయపోవడం, ప్రయాణ సమయంలో ఆలస్యం..ఇటువంటి సమస్యలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కరంపై స్పందించిన వాల్తేరు డీఆర్ఎం శ్రీవాస్తవతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ

By

Published : Jun 15, 2019, 6:44 AM IST

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ

రాష్ట్రం నుంచి దేశ రాజధానికి ప్రయాణించే ఏపీ ఎక్స్​ప్రెస్​ ప్రయాణం రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. వేసవి కాలంలో సమస్యలు మరింత అధికమై ప్రయాణికులు తంటాలుపడుతున్నారు. ప్రయాణ సమస్యలపై దృష్టి పెట్టి...వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వాల్తేర్ డీఆర్​ఏం శ్రీవాస్తవ అన్నారు. బోగీల్లో ఏసీలు తరచూ పనిచేయడంలేదని ప్రయాణికులు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ కోసం నిర్దేశించిన బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాటిలో జనరేటర్లు పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం చేస్తామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ సమస్యలు చక్కదిద్దే చర్యలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details