ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చీరాలను జిల్లాగా ప్రకటించాలని సంతకాల సేకరణ - new district

చీరాలను జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పోలవరపు ప్రసాద్ అన్నారు. చీరాలను జిల్లా చేయాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణను ప్రారంభించారు.

చీరాలను జిల్లా చేయాలని... లక్ష సంతకాల సేకరణ

By

Published : Jun 27, 2019, 6:26 PM IST

చీరాలను జిల్లా చేయాలని... లక్ష సంతకాల సేకరణ

చీరాలను జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని అర్హతులు ఉన్నాయని ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్​ పోలవరపు ప్రసాద్​ అన్నారు. దీనికోసం లక్ష సంతకాల సేకరణను గడియార స్తంభం కూడలిలో జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రం విభజన జరిగినప్పుడూ చీరాలకు అన్యాయం జరిగిందని జిల్లా సాధన ఐకాస కమిటీ సమన్వయకర్త తాడివలస దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో లక్ష మంది చేత సంతకాలు చేయించి ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చీరాల ప్రాంత అభిప్రాయాలను తెలియజేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details