కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆచార్య డాక్టర్ ఎం.సి.దాసు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రవర్తన, క్రమశిక్షణ విద్యార్థి లక్ష్యాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో నూజివీడులోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఉద్దేశించిన ఆచార్య డాక్టర్ ఎం.సి.దాసు మాట్లాడారు. కళాశాలకు ప్రతి విద్యార్థి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ట్రిపుల్ ఐటీలో చదివే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకోవాలన్నారు. మిగిలిన అన్ని విద్యాసంస్థల కంటే ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారని ప్రొఫెసర్ అన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అవగాహన తరగతులు - iiit
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొత్త చేరిన విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆచార్యులు ఎం.సి.దాసు మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు క్రమశిక్షణ అవగాహన తరగతులు