రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. బి-ఫారం అందుకున్న నేతలు నామపత్రాల దాఖలకు త్వరపడుతున్నారు. భారీ బందుగణంతో నామినేషన్లు వేస్తున్నారు. నిన్న విశాఖ గాజువాకలో జనసేన అధ్యక్షుడు పవన్ నామినేషన్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కడప జిల్లా పులివెందులలో ఇవాళ నామినేషన్ వేయనున్నారు. అనంతరం పులివెందులలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసగించనున్నారు. రెండుస్థానాల్లో పోటీ చేస్తున్న పవన్ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మంత్రి లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో నామినేషన్ వేయనున్నారు.
ఇవీ చూడండి