తెదేపాకు మోదుగుల టాటా! - guntur
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. పార్టీలు మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల... తెదేపాను వీడి వైకాపా గూటికి చేరేందుకు నిర్ణయించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెదేపాను వీడేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గపరిధిలోని ముఖ్య నేతలతో మోదుగుల సమావేశమయ్యారు. రాజకీయంగా తనకు అన్యాయం జరుగుతోందని... అందుకే పార్టీని వీడుతున్నాననీ స్పష్టం చేశారు. వైకాపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులుగా సహకరించినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశం అనంతరం హైదరాబాద్కు పయనమయ్యారు. వైకాపా అధినేత జగన్తో భేటీ కానున్నారు. మోదుగుల నర్సరావుపేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అది కుదరకపోతే...గుంటూరు పార్లమెంటు స్థానం నుంచైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం.ఇటీవల జరిగిన తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు హాజరు కాని మోదుగుల... పార్టీ మారుతున్నట్టు ఇవాల్టితో స్పష్టమైపోయింది.