నెల్లూరులో నిర్మాణం దిశగా ఉన్న నక్లెస్ రోడ్డు, ఇరుకళల పరమేశ్వరీ ఘాట్ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఇంజనీరింగ్ అధికారులతో విచారణ జరిపిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. స్వర్ణాల చెరువుపై నిర్మించిన నక్లెస్ రోడ్డు కాంక్రీట్ బీటలను తదితర పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేదిలేదని, గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మంత్రి వెంట ఉన్నారు.
ఇంజినీరింగ్ అధికారులపై మంత్రి అనిల్ ఆగ్రహం - visits
నెల్లూరులో ఉన్న నక్లెస్ రోడ్డు, ఇరుకళల పరమేశ్వరీ ఘాట్ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.
ఇంజినీరింగ్ అధికారులపై మంత్రి అనిల్ ఆగ్రహం
ఇదీ చదవండీ :