నిత్యం కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు...హంద్రినీవా నదీ జలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
మంత్రి కాలవ శ్రీనివాసులు
By
Published : Mar 27, 2019, 9:51 PM IST
రాయదుర్గంలో మంత్రి కాలవ ప్రచారం
అనంతపురం జిల్లాలో కరవు, తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా తెదేపా ప్రభుత్వం కృషి చేసిందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణం 12వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హంద్రినీవా జలాలను జిల్లాకు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి గుర్తుచేశారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే భైరవానితిప్పతో పాటు కీలక ప్రాజెక్ట్లన్నీ పూర్తవుతాయన్నారు.