ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ద్వారకా తిరుమలలో పేలిన  స్టౌవ్‌... తప్పిన ప్రమాదం - dwaraka tirumala

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదానం వద్ద స్టీమ్ పొయ్యి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. దీంతో భారీ శబ్దం రావడంతో గ్రామస్థులు భయాందోళన చెందారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ద్వారకా తిరుమలలో తప్పిన ప్రమాదం

By

Published : Jun 6, 2019, 1:57 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా స్వామివారి దర్శనం కోసం క్షేత్రానికి నిత్యం వేలాదిగా వచ్చే భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలను అందిస్తుంటారు. అయితే దేవస్థానం అధికారులు వంట చేసేందుకు అన్నదానం భవనం వద్ద రెండు స్టీమ్​ పొయ్యిలను, ఒక గ్యాస్ పొయ్యి ఉపయోగిస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది ఈ ఉదయం వంట మొదలుపెట్టగా... ఒక స్టీం పోయి నుంచి ఒక్కసారిగా పొగ వచ్చింది. దీన్ని చూసి భయపడిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ లోపే ఒక్కసారిగా ఆ స్టౌవ్‌ పేలింది. పొయ్యితో పాటు స్టీల్ పైప్ లైన్లు, చుట్టూ ఉన్న పరికరాలు, ప్రహరీ గోడ, రేకుల షెడ్డు మొత్తం ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున శబ్దం రావడంతో గ్రామస్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్ పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని సిబ్బంది భావిస్తున్నారు. అయితే సేఫ్టీ వాల్స్ ఉన్నప్పటికీ ఎలా జరిగింది అన్నది అధికారులకు అంతు పట్టడం లేదు.

ద్వారకా తిరుమలలో తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details