ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

డంపింగ్ యార్డు చెత్తతో రైతులకు తంటాలు! - rytus

స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని అధికారులే నిర్లక్ష్యం చేస్తున్నారు. మైదుకూరు పురపాలిక పరిధిలోని ఎల్లంపల్లి డంపింగ్ యార్డు నిర్వహణలో అధికారుల అలక్ష్యం రైతులకు నష్టాలను తెచ్చిపెడుతుంది.

డంపింగ్ యార్డు చెత్తతో రైతులకు తంటాలు!

By

Published : May 21, 2019, 8:11 AM IST

డంపింగ్ యార్డు చెత్తతో రైతులకు తంటాలు!

ఓ పక్క స్వచ్ఛ ఆంధ్ర కలలు సాకారానికి ప్రయత్నాలు జరుగుతుంటే..ఆ కలలను కల్లలుగా మార్చేస్తున్నారు కొందరు అధికారులు. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో కడప జిల్లా మైదుకూరు పురపాలిక డంపింగ్ యార్డు ప్రమాదంగా మారింది. డంపింగ్ యార్డు​లోని చెత్త పక్కనున్న పొలాల్లోకి చేరుతుంది. వ్యర్థాలు పొలాల్లో చేరి పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తగలబెట్టడం నిబంధనలకు విరుద్ధమని జాతీయ హరిత ట్రిబ్యునల్ 2016 డిసెంబర్ 12న ప్రకటించినా...ఈ యార్డులో మాత్రం నిరంతరం ప్రక్రియ కొనసాగుతోందని రైతులు అంటున్నారు.

మైదుకూరు పురపాలిక పరిధిలోని ఎల్లంపల్లి వద్ద మట్టి కోసం తవ్విన గోతులు ఉన్న ప్రాంతాన్ని అధికారులు డంపింగ్ యార్డు కోసం కేటాయించారు. పురపాలికలో సేకరిస్తున్న చెత్తనంతా ఈ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ చెత్తలో తేలికపాటి ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు...గాలులకు పక్కనే ఉన్న పొలాల్లోకి చేరుతున్నాయి. పంట సాగు చేసే ప్రతిసారి ఈ వ్యర్థాలు తొలగించడం అవస్థలా మారిందని రైతులు అంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు పొలాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా డంపింగ్ యార్డు చుట్టూ కంచె, దారి నిర్మాణానికి రూ.6 లక్షలు జారీ అయినా ఇప్పటికీ పనులు చేపట్టలేదని స్థానికులు అంటున్నారు. డంపింగ్ యార్డు​లో చెత్త నిరంతరం దహనమవుతూ దట్టమైన పొగలు వెదజల్లుతుండటంతో పనులు చేసేందుకు కూలీలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చకూడదన్న నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వెల్లడించారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు మేల్కొని...పొలాల్లోకి చెత్త చేరకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details