రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయన్నారు. రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే సూచనలున్నాయని అప్రమత్తం చేశారు.
24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజుల పాటు వర్షాలు - coastal andhra
ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం