ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై హైకోర్టు స్టే

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3 వరకు సినిమా ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్‌ 3న సినిమా చూస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు. సుప్రీంలో అపీల్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు.

ntr

By

Published : Mar 28, 2019, 9:05 PM IST

వివాదాస్పద సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మసిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ హైకోర్టు సైతం క్లియరెన్స్ ఇచ్చేశాయి. ఇక సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు అనుకుంటోన్న తరుణంలో రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా విడుదలపైస్టే ఇచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న శాసనసభ ఎన్నికలు జరగనున్న సమయంలోఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సినిమా విడుదలను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 3 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను థియేటర్లలో.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజక్షన్ ఆర్డర్‌ జారీ చేసింది. ఈ పరిణామంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఆంధ్రప్రదేశ్‌లో బ్రేకులు పడినట్లయింది. ఈ సినిమాకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి, వర్మ రేపు ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేస్తారో లేదో చూడాలి.

సుప్రీంకు వెళ్తాం!

హైకోర్టు ఉత్తర్వులపై చిత్ర నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు నిర్ణయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details