ఏపీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి ర్యాంకు కార్డులను లాసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. లాసెట్ ఫలితాల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు గాను కడప జిల్లాకు చెందిన వెంకటశివారెడ్డికి మొదటిర్యాంకు సాధించినట్లు విజయరాజు చెప్పారు. రెండో ర్యాంకు చిత్తూరు జిల్లారు ఆర్. జగదీశ్ పొందినట్లు తెలిపారు. అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీలో మొదటి ర్యాంకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్. సూరజ్, రెండో ర్యాంకు కర్నూలుకు చెందిన కిరణ కుమార్ రెడ్డి కైవసం చేసుకున్నట్లు విజయరాజు ప్రకటించారు.
లాసెట్ 2019 ఫలితాలు విడుదల
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు అమరావతిలో విడుదల చేశారు. లాసెట్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన వెంకటశివారెడ్డి మొదటి ర్యాంకు సాధించారు.
ఎల్‌ఎల్‌బీలో దాదాపు 9 వేల సీట్లు ఉన్నాయని ఛైర్మన్ విజయరాజు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం అర్హత పరీక్ష లాసెట్‌కు 11,497 మంది విద్యార్థుల హాజరు కాగా 10,831 మంది అర్హత సాధించారని తెలిపారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 7,764 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 2,396 మంది, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 671 మంది ఉత్తీర్ణత పొందినట్లు వెల్లడించారు.
లాసెట్ పరీక్ష ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net ద్వారా తెలుసుకోవచ్చు.