తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో రిటైర్డ్ డీపీవో గద్దల సంజీవ్... 14ఏళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకుని పెంచుకున్నాడు. టిక్కూ అని పేరు పెట్టుకున్నాడు. గత ఏప్రియల్ 17న టిక్కు అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సంజీవ్.. టిక్కు జ్ఞాపకాలతోనే గడుపుతున్నాడు. నెల మాసికాన్నీ జరిపించాడు. బంధు మిత్రులందరిని ఆహ్వానించాడు.
తెలంగాణలో... కుక్కకి మాసికం చేసిన యజమాని
తన భార్య మరణం కూడా అతడిని అంతగా బాధించలేదు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మరణం మాత్రం తీవ్రంగా కలిచి వేసింది. గతనెల 17న మరణించిన టిక్కుకి నెల మాసికం నిర్వహించాడు.
kukka
సంజీవ్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. కుమార్తెలు అమెరికాలో, కొడుకు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడేళ్ల క్రితం భార్య మరణించింది. తోడుగా టిక్కు మాత్రమే ఉండేది. తన భార్య చనిపోయినప్పుడూ ఇంతలా బాధపడలేదని.. పెంపుడు శునకం మరణంపై సంజీవ్ ఆవేదన చెందాడు. ఒంటరిగా ఉన్న తనకు టిక్కు తోడుగా ఉందని..ఇప్పుడు అదీ చనిపోవటం వల్ల మళ్లీ ఒంటరయ్యానని వాపోయాడు.