ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కియా కార్ల తొలి విక్రయ కేంద్రం ఇక్కడే!

కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్​ దేశంలో తన తొలి కార్ల షోరూమ్​ ఏర్పాటు చేసింది. అనంతపురం జిల్లాలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉత్తర్​ప్రదేశ్​లో నోయిడాలో సొంత విక్రయ కేంద్రాన్ని తెరచింది. వచ్చే జూలై తర్వాత తొలి కారును రోడ్డుపైకి తీసుకురావాలని యత్నిస్తుంది.

అనంతలో పుట్టింది... నోయిడాలో విక్రయం కానుంది.

By

Published : Jun 13, 2019, 6:46 AM IST

అనంతపురం జిల్లా పెనుగొండలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్ తొలి విక్రయకేంద్రాన్ని ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. అనంతపురం ప్లాంటులో ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న కియా.. వీటిని దేశీయ మార్కెట్​లో విక్రయించేందుకు వీలుగా డీలర్లను నియమిస్తోంది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సొంత విక్రయ కేంద్రాన్ని ఉత్తర్​ప్రదేశ్ లోని నోయిడాలో ఏర్పాటు చేశారు. 'రెడ్ క్యూబ్ ' పేరిట ప్రత్యేక థీమ్​తో దేశవ్యాప్తంగా ఈ షోరూమ్​లను ఏర్పాటు చేయాలని కియా మోటార్స్ భావిస్తోంది. వచ్చే జూలై తర్వాత తొలికారును అనంతపురం ప్లాంటు నుంచి రోడ్డుపైకి తీసుకురావాలని కియా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్​లోని ప్లాంటు నుంచి ఏడాదికి మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి దేశీయ డీలర్ల ద్వారా విక్రయాలను చేయనున్నారు. ఇందుకోసం తొలి షోరూమ్​ను నోయిడాలో ఏర్పాటు చేసినట్టు కియామోటార్స్ ప్రకటించింది.

అనంతలో పుట్టింది... నోయిడాలో విక్రయం కానుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details