ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు - ప్రధాని

వెనుకబడిన వర్గాలపై ప్రధాని మోదీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీసీల జపం చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు

By

Published : Apr 21, 2019, 7:49 PM IST

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు
ప్రధాని మోదీ.. ఓట్ల కోసమే వెనకబడిన వర్గాలను నెత్తికెత్తుకుంటున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. పరిపాలనలో మోదీ విఫలమైన తీరుకు ఇది నిదర్శనమని చెప్పారు. 14 అంశాలను స్పృశిస్తూ.. ప్రధానికి లేఖ రాశారు కళా వెంకట్రావు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉంటూ కులాలను రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నారని.. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించారు.

''ఓట్ల కోసం చాయ్​వాలా అని చెప్పుకొంటున్న మీరు.. బలహీన వర్గాల ప్రజలకు ఒక్క మంచిపనైనా చేశారా'' అని కళా ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దిల్లీకి పంపిన తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదన్నారు. 2018-19 బడ్జెట్​లో దేశంలోని 70 కోట్ల మంది బీసీల కోసం 7 వేల 750 కోట్లు కేటాయిస్తే.. ఆంధ్రప్రదేశ్​ బీసీల కోసం 16 వేల కోట్లు కేటాయించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details