'రూ.7 వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాం' - tdp
ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రైతులకు ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని..రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టం చేశారు.
2014లో అధికారం చేపట్టి విద్యుత్ లోటు ఎక్కువగా ఉండేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. 8నుంచి12గంటలు విద్యుత్ కోతలను అనతికాలంలోనే అధిగమించామని తెలిపారు.రైతులకు ఇప్పుడు9గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని...ప్రభుత్వం రూ.7వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తోందని పేర్కొన్నారు.ఆక్వా సాగు వల్ల రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు.యూనిట్ విద్యుత్‌ను రూ.3.75నుంచి రూ.2కి తగ్గించామని అన్నారు.అన్ని వర్గాలకు రూ.8వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు.రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టం చేశారు.