ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జలాశయంలో పడి ముగ్గురు మృతి - three

సరదా కోసం జలాశయంలో దిగిన బావ, ఇద్దరు మరదళ్లు మృతి చెందిన  విషాద ఘటన తెలంగాణలోని జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మాకూరులో చోటు చేసుకుంది. ముగ్గురి మృతితో ఆ ప్రాంతం అంతా రోదనలతో మారుమోగింది.

జలాశయంలో పడి ముగ్గురు మృతి

By

Published : Jun 1, 2019, 6:27 PM IST

జలాశయంలో పడి ముగ్గురు మృతి

జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మాకూరులో విషాదం చోటుచేసుకుంది. అదే జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన అవినాశ్‌ భార్యతో సహా మరో ఇద్దరు మరదళ్లతో కలిసి బొమ్మాకూరు జలాశయం వద్దకు వెళ్లారు. ఉదయం వెళ్లిన వారంతా జలాశయం వద్ద ఉల్లాసంగా గడిపారు. ఫోటోలు దిగేందుకు నీటిలోకి దిగారు. భార్య ఫోటో దింపుతానని చెప్పగా...అవినాశ్‌ ఇద్దరు మరదళ్లతో కలిసి నీటిలోకి వెళ్లారు. ఇంతలోనే ప్రమాదశవశాత్తు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయారు. భార్య చూస్తుండగానే ముగ్గురు నీళ్లలో మునిగిపోయారు. గట్టుపై వున్న భార్య దివ్య కేకలు వేయడంతో స్థానికులు జలాశయం వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

విషాదం

ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై పరమేశ్వర్‌ ఆధ్వర్యంలో స్థానికులు కొంతమంది ఈతగాళ్లు జలాశయంలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. దీంతో జలాశయం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు జలాశయం వద్దకు చేరుకొని బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పబ్​జీ ఆడుతుంటే గుండెపోటు- యువకుడి మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details