ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం: డివైడర్లపైకి ఎక్కిన కార్యకర్తలు - ap elections @2019

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం జరిగింది. ఉదయమే జగన్‌ నంద్యాలకు వస్తారని స్థానిక నాయకులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. జగన్‌ వస్తారని ఉదయం నుంచి వాహనాలను లోపలికి పోనీయకుండా మొత్తం బారీ కేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం:

By

Published : Apr 5, 2019, 7:39 AM IST

జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం: డివైడర్లపైకి ఎక్కిన కార్యకర్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జగన్‌ రోడ్‌ షోలో విధ్వంసం జరిగింది .ఉదయమే జగన్‌ నంద్యాలకు వస్తారని స్థానిక నాయకులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు.జగన్‌ వస్తారని ఉదయం నుంచి వాహనాలను లోపలికి పోనీయకుండా మొత్తం బారీ కేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఈ పరిస్థితుల్లో జనం తీవ్ర అవస్థలు పడ్డారు.మధ్యాహ్నాం3గంటలకు జగన్‌ నంద్యాలకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన జగన్... బహిరంగ సభ నిర్వహిస్తుండగా కార్యకర్తలు రోడ్ మధ్యలో ఉన్న డివైడర్లపైకి ఎక్కి మొత్తం ధ్వంసం చేశారు.శ్రీనివాస సెంటర్ నుంచి కిలో మీటరుకుపైగా డివైడర్లను విరగొట్టారు.ఎవరైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు .

ABOUT THE AUTHOR

...view details