ప్రత్యేక హోదా, ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం
ఏపీ భవన్‌లో వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. సీఎం జగన్ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశమయ్యారు.పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు.శాఖలవారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్.....ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించనున్నారు.కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి నిధుల విడుదలకు ఆయా బృందాలు పనిచేయాలని సీఎం సూచించారు.ప్రత్యేక హోదా,ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం జగన్....ప్రత్యేక హోదా ఇచ్చేవరకు అడుగుతూనే ఉండాలన్నారు.పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు..