ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

''ట్విట్టర్​ సీఈవోకు సమన్లు'' - CEO

వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఎన్నికల్లో జోక్యం తదితర అంశాలపై ట్విట్టర్​ను వివరణ కోరింది ఐటీ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ. ఫిబ్రవరి 25లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆ సంస్థ​ సీఈవోకు సమన్లు జారీ చేసింది.

''ట్విట్టర్​ సీఈవోకు సమన్ల జారీ''

By

Published : Feb 12, 2019, 9:21 AM IST

Updated : Feb 12, 2019, 11:06 AM IST

ఫిబ్రవరి 25 లోపు తమ ఎదుట హాజరుకావాలని ట్విట్టర్​ సీఈవోకు సమన్లు జారీ చేసింది ఐటీ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ. గత గడువు ఫిబ్రవరి 11న హాజరుకానందున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన జూనియర్​ అధికారులతో సమావేశమయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పింది.

సంస్థ సీఈవో జాక్​ డార్సీతో పాటు ఇతర సీనియర్లు హాజరుకావాలని పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్​ అనురాగ్​ ఠాకుర్​ పేర్కొన్నారు. త్వరలో లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సరళిలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సామాజిక మాధ్యమాల్ని హెచ్చరించింది కేంద్రం. అందులో భాగంగానే ట్విట్టర్​ వర్గాల్ని తమముందు హాజరు కావాలని పిలిచింది. దీనిపై ట్విట్టర్ ఇంకా ఏ సమాధానమివ్వలేదు.

ఫిబ్రవరి 11న ట్విట్టర్​ వర్గాలు హాజరు కావాల్సి ఉండగా తక్కువ సమయం కారణంగా హాజరు కాలేమని తొమ్మిదో తేదిన సమాధానమిచ్చాయి. ఐటీ చట్టానికి విరుద్ధంగా పోస్టులు చేయడం, వ్యక్తిగత ఖాతాల్లోని సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి కార్యకలాపాలపై కొద్ది రోజులుగా ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం.

Last Updated : Feb 12, 2019, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details