లోకేశ్ ట్వీట్లపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. ఓడిపోయి ముఖం చూపించుకోలేకే లోకేశ్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే గోదావరి జలాల తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం పనులకు ఆటంకం లేదన్న మంత్రి... జులై నుంచి అక్టోబరు వరకూ గోదావరిలో వరద కారణంగా పనులు ఆగాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలు వీడి కలసి పని చేయాలని సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారన్నారు. గోదావరి జలాల తరలింపుపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా సృష్టిస్తామని మంత్రి అన్నారు.
"ఓటమిని జీర్ణించుకోలేకనే.. లోకేష్ ట్వీట్లు"
రాయలసీమ కరవు పరిస్థితులను మార్చడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం పనులకు ఆటంకం లేదన్న మంత్రి.. గోదావరి వరద కారణంగా పనులు తాత్కలికంగా నిలిచాయని తెలిపారు.
మంత్రి అనిల్ కుమార్