ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రావనాపల్లిలో అక్రమంగా మట్టి తవ్వకాలు - ravanapalli

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా అక్రమార్కులు మట్టి తరలించుకుపోతున్నారు. రోజుకు 200 ట్రాక్టర్ల లోడు మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

By

Published : May 30, 2019, 6:30 PM IST

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

విశాఖ జిల్లా గొలుగొండ మండలం రావనాపల్లి జలాశయం వద్ద అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సీపట్నంకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటున్నారు. 30 ట్రాక్టర్లు, 3 జేసీబీలతో తవ్వకాలు చేపట్టి...మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా రోజుకు 200 నుంచే 300 ట్రాకర్ల లోడు మట్టి తరలిపోతుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ తవ్వకాలుగా రుజువైతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details