ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోపిదేవి దేవస్థానం స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత - అక్రమ కట్టడాలు కూల్చివేత

కృష్ణా జిల్లాలోని మోపిదేవి దేవస్థానం పరిసరాల్లో ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగించారు. మోపిదేవి ఆలయం, 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిర్మాణాలను ప్రొక్లైన్ల సాయంతో తీసివేశారు.

మోపిదేవి దేవస్థానం స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

By

Published : Jul 2, 2019, 1:31 PM IST

మోపిదేవి దేవస్థానం స్థలాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత
కృష్ణా జిల్లాలోని పవిత్ర మోపిదేవి దేవస్థానం చుట్టుపక్కల అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. కోర్టు ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు ఇవాళ అక్రమ నిర్మాణాలను తొలిగించారు. మోపిదేవి చుట్టుపక్కల, 216 జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. గత 10 సంవత్సరాలుగా విచారణలో ఈ సమస్యపై కట్టడాలు తొలిగించాలని కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ ప్రదేశాలను దేవస్థానం అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details