ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇలాగైతే సభను నడపలేను: వెంకయ్య - రాజ్యసభ

సభకు ఆటంకం కలిగించే రీతిలో సభ్యుల ప్రవర్తన ఉంటే సభను నడపలేమని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాగైతే సభను నడపలేను: వెంకయ్య

By

Published : Feb 7, 2019, 12:46 PM IST

ఇలాగైతే సభను నడపలేను: వెంకయ్య
బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభాపతి మాట్లాడుతున్నపుడు ఇష్టానుసారంగా ప్రవర్తించడమేంటని ప్రశ్నించారు. ఇలాగేతై సభను నడపలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, రేపటి కార్యక్రమాలపై వెంకయ్యనాయుడు వివరిస్తోన్న సందర్భంగా సమాజ్​వాదీ పార్టీ ఎంపీ రాం గోపాల్​ యాదవ్​ మధ్యలో కలుగజేసుకున్నారు. దాంతో ఆగ్రహించిన వెంకయ్య మిమ్మల్ని అడిగానా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ సభ్యుల తీరుపై కోపగించుకోవద్దని ఛైర్మన్​కు విన్నవించారు. ఎవరూ సభకు ఆటంకం కలిగించొద్దని సభ్యులను ఆజాద్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details