నేటితో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచార జోరు...పార్టీ నేతల మాటల యుద్దంతో మార్మోగిన మైకులు ఇవాళ్టి సాయంత్రానికి మూగబోనున్నాయి. మార్చి 18న ఎన్నికల ప్రకటన వెలువడింది. దీంతో అభ్యర్థుల ప్రచారానికి కేవలం 21 రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. మార్చి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగినందున చాలా చోట్ల ప్రచారం చేపట్టలేదు. 15 రోజుల వ్యవధిలో క్షణం తీరికలేకుండా అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. బహిరంగ సభలు, రోడ్ షో తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెదే కు మద్దతుగా మాజీ ప్రధాని దేవేగౌడ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమబంగా, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచార పర్వానికి నేటి సాయంత్రంతో తెర - ap elections
నేటితో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచార జోరు...పార్టీ నేతల మాటల యుద్దంతో మార్మోగిన మైకులు ఇవాళ్టి సాయంత్రానికి మూగబోనున్నాయి.
నేటితో ప్రచారపర్వానికి తెర
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మార్చి 17న విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. ఆయనకు మద్దతుగా విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా, ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి 3 జిల్లాల్లో ప్రచారం చేశారు. భాజపా తరఫున ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సిగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.